అలాంటి పాత్రలు చేయను : షారుఖ్

రా.వన్, డాన్-2 చిత్రాల్లో వరుసగా భారీ పోరాట సన్నివేశాలు చేస్తున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ బాగా అలిసి పోవడమే కాదు, అలాంటి పాత్రలపై విసుగు పుట్టినట్లుంది. అందుకేనేమో ప్రేమ కథా చిత్రాల్లో నటించాలనే తన మనసులోని కోరికను బయట పెట్టాడు. ఓ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ రా.వన్ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చేయడం వల్ల శరీరం బాగా ఒత్తిడికి గురయ్యాననిచెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగా రావడం కోసం శారీరకంగా శిక్షణ తీసుకున్నాను. ప్రస్తుతం రా.వన్ చిత్రం ప్రచారం కోసం పరుగులు పెడుతున్నాను. ఈ నేపథ్యంలో చాలా అలసి పోయాను అన్నారు.

అందుకే కొన్ని రోజుల పాటు ఇలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పుడిక రొమాంటిక్ స్టోరీల కోసం చూస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో...తర్వలోనే షారుఖ్ నుంచి రబ్ దే బనాదీ జోడీలాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని బాలీవుడ్ టాక్. మరోసారి రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి అందుకు తగిన కథల కోసం వెతుకుతున్నాడని చర్చించుకుంటున్నారు.


--
If you like this post please post your comment

No comments:

Post a Comment